‘ఎల్లమ్మ’పై ‘తమ్ముడు’ ప్రభావం చూపిస్తాడా..?

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ మంచి అంచనాల మధ్య నిన్న(జూలై 4) గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు.

కాగా, నితిన్ కెరీర్‌లో ‘తమ్ముడు’ కూడా ఓ ఫ్లాప్ చిత్రంగా నిలవబోతుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. అయితే, ఈ సినిమా నితిన్ చేయబోయే నెక్స్ట్ చిత్రంపై కూడా ప్రభావం చూపుతుందా అనే సందేహం నెలకొంది. ‘బలగం’ ఫేం డైరెక్టర్ వేణు యెల్దండి డైరెక్షన్‌లో నితిన్ త్వరలో ‘ఎల్లమ్మ’ అన సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా నిరమాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు.

తమ్ముడు సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్‌తో దిల్ రాజు మరోసారి రిస్క్ తీసుకుంటారా..? అయితే, నితిన్ స్థానంలో ‘ఎల్లమ్మ’లో వేరొక హీరోను తీసుకుంటారా..? అనే సందేహం ప్రస్తుతం సినీ సరిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version