టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ చిత్రం ‘గరివిడి లక్ష్మి’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఆమె పేరుపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
హీరోయిన్ ఆనంది లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రాగ్ మయూర్, నరేష్, రాశి, శరణ్య ప్రదీప్ తదిరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని గౌరి నాయుడు జమ్ము డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 18న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఓ ప్రీలుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.