‘బంగారు కోడిపెట్ట’ నవదీప్ కి లక్ ని ఇస్తుందా?

navadeep_bangaru_kodipeta

యంగ్ హీరో నవదీప్ ఫిబ్రవరిలో ‘బంగారు కోడిపెట్ట’ సినిమాతో తన లక్ ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమా నవదీప్ కెరీర్ కి చాలా కీలకం కానుంది ఎందుకంటే తను సోలోగా హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ‘చందమామ’ నవదీప్ లోని టాలెంట్ ని చూపించిన సినిమా. త్వరలో రానున్న ‘బంగారు కోడిపెట్ట’ సినిమా నవదీప్ కి లక్ ని ఇస్తుందా? అనేది చూడాలి.

ఇప్పటివరకూ ఈ సినిమాకి ఇండస్ట్రీలో రిపోర్ట్స్ బాగున్నాయి. స్వాతి ఈ మూవీలో నవదీప్ కి జోడీగా నటించింది. రాజ్ పిప్పళ్ళ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సునీత తాటి నిర్మించింది. మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version