డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన రియల్ మెన్ ఛాలెంజ్ రాజమౌళితో ప్రాచుర్యం పొంది, టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఆసక్తికరంగా మారుతుంది. ఆడవారికి గౌరవం ఇవ్వడం, వారి శ్రమలో పాలుపంచుకోవడం అనే కాన్సెప్ట్ తో మొదలైన రియల్ మెన్ ఛాలెంజ్ ని అందరూ స్వీకరించడమే కాకుండా పూర్తి చేసి.. తన సన్నిహితులు మరియు ఇష్టమైన వారికి విసురుతున్నారు. రాజమౌళి ఈ ఛాలెంజ్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లకు విసిరాడు. ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య మరియు వెంకీలను నామినేట్ చేశారు.
ఐతే బాబాయ్ లంటూ ఎన్టీఆర్ ప్రేమగా నామినేట్ చేసిన నాగ్, బాలయ్య దీనికి స్పందించక పోవడం పరిశ్రమలో ఆసక్తి రేపుతుంది. అసలు వీళ్లిద్దరికీ ఎన్టీఆర్ ఛాలెంజ్ నెరవేర్చే ఆలోచన ఉందా లేదా అని అందరూ అనుకుంటున్నారు. తొందరెందుకు వారు కొంచెం టైం తీసుకొని ఈ టాస్క్ పూర్తి చేస్తారని కొందరు అంటున్నారు. మరి చూడాలి బాలయ్య, నాగ్ ఎన్టీఆర్ ఛాలెంజ్ ని పూర్తి చేస్తారో లేదో.