ఎఫ్ 3 లో మహేష్ క్యామియో..?


ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాల సక్సెస్ తో దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోచేరాడు. ఇక ప్రస్తుతం ఆయన ఎఫ్2 కి సీక్వెల్ గా రానున్న ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. తన రైటింగ్ టీమ్ తో కలిసి తన హోమ్ టౌన్ లో దీనిపైన కసరత్తు మొదలుపెట్టారు. కాగా ఎఫ్3లో వెంకటేష్, వరుణ్ లతో పాటు, హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ నటించడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్ 2లో సందడి చేసిన సేమ్ టీమ్ ఎఫ్3 లో కూడా రచ్చ చేయనున్నారని అర్థం అవుతుంది. ఐతే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో ఉంటారు అని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

స్క్రిప్ట్ పూర్తి అయిన తరువాత ఆ స్టార్ హీరో ఎవరో నిర్ణయిస్తాను, అన్నారు. ఐతే ఆ స్టార్ హీరో కేమియో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తుంది అని అన్నారు. ఐతే ఆ సర్ప్రైజ్ హీరో సూపర్ స్టార్ మహేష్ అని టాలీవుడ్ లో టాక్ వినబడుతుంది. అనిల్ తో మహేష్ కి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆ గెస్ట్ రోల్ కి ఆయన ఒప్పుకున్నారట. ఇక గతంలో మహేష్, వెంకీ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ చేశారు. ఎఫ్3 లో మళ్ళీ వెంకీ, మహేష్ లు సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకొనే సూచనలు కలవు అంటున్నారు. మరి ఇదే కనుక నిజం ఐతే సినీ ప్రేమికులకు పండగే.

Exit mobile version