చిరు-పూరి భేటీ…కాంబినేషన్ సెట్టయ్యిందా?

చిరు-పూరి భేటీ…కాంబినేషన్ సెట్టయ్యిందా?

Published on Jul 22, 2020 12:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో మూవీ వస్తే చూడాలని ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు కమ్ బ్యాక్ మూవీ పూరి దర్శకత్వంలో దాదాపు ఖాయం అయ్యింది. పూరి రాసిన ఆటో జానీ అనే కథ, ఎందుకో చిరంజీవికి నచ్చలేదు. ఆ తరువాత వి వి వినాయక్ తో తమిళ్ హిట్ మూవీ కత్తి ని తెలుగులో ఖైదీ 150గా చేసి భారీ హిట్ అందుకున్నారు.

ఐతే పూరి మాత్రం ఎప్పటి నుండో చిరంజీవికి నచ్చే కథ సిద్ధం చేసి మూవీ చేస్తాను అని శబధం చేశారు. కాగా ఈ మధ్య పూరి, చిరంజీవిని తన నివాసంలో కలిసినట్లు తెలుస్తుంది. దీనితో చిరంజీవికి ఓ కొత్త కథను చెప్పడానికే పూరి వెళ్లారనే అనుమానాలు కలుగుతున్నాయి. లాక్ డౌన్ సమయం నుండి కొత్త కథలను రాయడంలో బిజీగా ఉన్న పూరి..చిరు కోసం ఓ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేసేడేమో అనిపిస్తుంది. మరి అధికారిక ప్రకటన వస్తే కానీ, దీనిపై స్పష్టత రాదు.

తాజా వార్తలు