ఛార్మి కలని సేవకుడు నేరవేరుస్తాడా?

ఛార్మి కలని సేవకుడు నేరవేరుస్తాడా?

Published on Jan 3, 2013 2:30 PM IST

Sevakudu
కెరీర్ మొదట్లో వరుస విజయాలను, టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న చార్మింగ్ బ్యూటీ ఛార్మి ఆ విజయాల పరంపరని కొనసాగించలేకపోయింది. దాంతో ఈ క్రేజీ భామ కాస్తా సరైన ఆఫర్లు లేక చిన్న చిన్న సినిమాల్లో, అడపాదడపా ఐటెం సాంగ్స్ లో కనిపిస్తూ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఛార్మి చివరిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మంగళ’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఛార్మి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ తో కలిసి చేసిన ‘సేవకుడు’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. వి. సముద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో అయినా తనకి అందని ద్రాక్షలా మిగిలిపోయిన హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.

ప్రస్తుతం ఛార్మి ఈ సినిమా కాకుండా ‘జిల్లా గజియాబాద్’ అనే హిందీ సినిమా, ‘ప్రేమ ఒక మైకం’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్న ఛార్మికి 2013 అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు