‘భైరవం’ తో బెల్లంకొండ రేంజ్‌ ఛేంజ్? టాలీవుడ్‌ స్టార్‌ జాబితాలోకి ఛాన్స్?

‘భైరవం’ తో బెల్లంకొండ రేంజ్‌ ఛేంజ్? టాలీవుడ్‌ స్టార్‌ జాబితాలోకి ఛాన్స్?

Published on May 27, 2025 2:00 AM IST

ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన మొదటి సినిమా తోనే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో హిట్ కొట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మరి అలాంటి అరుదైన ఫీట్ ని అందుకున్న హీరోస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒకరు. కమర్షియల్‌ మాస్‌ హీరోగా పేరుపొందిన హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఈ సారి రూటెడ్‌ కథతో.. ఓ డిఫరెంట్‌ లుక్‌తో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భైరవం’.

డ్యాన్సులు, ఫైట్స్‌ల విషయంలో మంచి పేరు పొందిన ఈ యంగ్‌ మాస్‌ హీరో ఈ సారి మరింత రగ్గడ్‌గా, మోర్‌ ఎమోషన్స్‌ మిక్స్‌ అయిన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ‘భైరవం’ ప్రమోషన్‌ కంటెంట్‌ ట్రైలర్‌, టీజర్‌, పాటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనదైన మార్క్‌ను చూపించాడు. పాటల్లో, యాక్షన్‌ సీక్వెన్సీల్లో ఎంత ఎనర్జీగా కనిపించాడు.

అంతేకాదు ఈ సినిమాలో శ్రీనివాస్ నుంచి చాలా ఛేంజ్ గమనించవచ్చు. గత సినిమాలు కంటే బెటర్ వెర్షన్ తన నుంచి కనిపిస్తుంది. దాదాపు రెండున్నర ఏళ్ల గ్యాప్‌ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ఈ చిత్రం ఆయన ఖాతాలో సూపర్‌హిట్‌గా నిలుస్తుందని సెన్సారు రిపోర్టు తెలుసుకున్న సినీ ప్రముఖులు అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకోసం, ఆ పాత్ర కోసం ఈ హీరో ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశాడని యూనిట్‌ చెబుతోంది.

ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందని, ఈ చిత్రం ఆయనకు స్టార్‌ హీరో రేంజ్‌ తీసుకొస్తుందని ‘భైరవం’ యూనిట్‌ చెబుతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బెల్లంకొండ ప్రస్తుతం దృష్టంతా ‘భైరవం’ ప్రమోషన్స్‌పైనే ఉంది. అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో తాను ఒక్కడే కాకుండా మొత్తం యూనిట్ గట్టి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ చిత్రం శ్రీనివాస్ కి గేమ్ ఛేంజింగ్ సినిమా అవుతుందో లేదో ఈ 30 వరకు ఆగితే తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు