ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మళ్లీ నటించాబోతుందా? ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇదే. మిసెస్ బచ్చన్ ఆడ బిడ్డకి జన్మనిచ్చిన తరువాత మళ్లీ నటిస్తుందా లేదా అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఆమె పలు భారీ ప్రాజెక్ట్స్ లో మళ్లీ నటించనుందని ధృవీకరిస్తున్నారు. కాని మళ్లీ ఆమె ఎప్పుడు తెరపై కనిపించబోతుంది అనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆమె తన కూతురి ఆలనా పాలనా దగ్గరుండి చూస్తూ నిజ జీవితంలో తల్లి పాత్ర పోషిస్తుంది. బచ్చన్ కుటుంబ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె స్క్రిప్టులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారని, ఆమె కూతురు మొదటి సంవత్సరం పూర్తయిన తరువాత మళ్లీ నటించాబోతుందని చెబుతున్నారు. నిర్మాతలు కూడా ఆమెను ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఐశ్వర్య రాయ్ తిరిగి మళ్లీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.