ఓ వారం రోజులు టాలీవుడ్ లో రియల్ మెన్ ఛాలెంజ్ హల్ చల్ చేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బుర్రలో పుట్టిన రియల్ మెన్ ఛాలెంజ్ కి రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి బడా సెలెబ్రిటీలు స్పందించడంతో ఇది బాగా ఫేమస్ అయ్యింది. ఐతే ఈ ఛాలెంజ్ మూడవ ఫేజ్ లో విఫలం చెందింది. చిరు, వెంకీ, ఎన్టీఆర్ లు ఛాలెంజ్ చేసిన కొందరు హీరోలు దీనికి స్పందించలేదు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, ప్రభాస్ కూడా దీన్ని లైట్ గా తీసుకున్నారు.
వెంకటేష్ ఎన్టీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పూర్తి చేశాడు. అలాగే ఆయన మహేష్ ని ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. మహేష్ ఈ ఛాలెంజ్ పూర్తి చేయలేదు. ఇక హీరో ప్రభాస్ ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నామినేట్ చేశారు. ప్రభాస్ సైతం ఈ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. మహేష్, ప్రభాస్ లు ఈ ఛాలెంజ్ పూర్తి చేయకపోవడానికి కారణం ఏమిటో తెలియలేదు. అలాగే నాగ్, బాలయ్య, రవితేజ, వరుణ్ తేజ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు.