పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న పలు అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో ఒకటైన కల్కి 2898 ఎడి సీక్వెల్ కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి సంబందించిన ఓకే షాకింగ్ న్యూస్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో ఎంతో కీలక పాత్ర చేసిన దీపికా పదుకోణ్ ని తప్పించడం నెక్స్ట్ మేకర్స్ పెద్ద సవాలు అని చెప్పవచ్చు.
దీనితో పార్ట్ 2 లో బలమైన ఆ రోల్ ని భర్తీ చేసేది ఎవరు అనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అయితే చాలా మంది పేర్లే ఇందుకు వినిపిస్తున్నాయి కానీ ఆ పాత్రని మ్యాచ్ చేసే ఆరా కూడా ఉండే ఆ పర్సనాలిటీ ఎవరు అనేది నాగ్ అశ్విన్ అండ్ కో కి మాత్రమే తెలుసు. సో ఆ నటి ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మొత్తం ప్రీ ప్రొడక్షన్, సెట్ వర్క్స్ పూర్తి చేసుకోగా మేకర్స్ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.