పవన్ కి అందుకే హీరోయిన్ దొరకడం లేదా?

పవన్ కి అందుకే హీరోయిన్ దొరకడం లేదా?

Published on Apr 12, 2020 3:33 PM IST

పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ తో పాటు ఒక సాంగ్, కొన్నిసన్నివేశాల చిత్రీకరణ మిగిలివుంది. మే నెలలో విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ఈ మూవీలో పవన్ కి హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తుంది అంటూ బాగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ హ్యాట్రిక్ మూవీలో నటించనున్నారని అనేక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. ఐతే వాటిని శృతి హాసన్ ఖండించారు. వకీల్ సాబ్ లో నేను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పవన్ సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరై ఉన్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. వకీల్ సాబ్ లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండదు. కేవలం కమర్షియల్ కోణం కోసం ఒరిజినల్ చిత్రానికి కొన్ని మార్పులు చేసి సాంగ్, సన్నివేశాలు జోడించారు. కాబట్టి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోరు. కావున వకీల్ సాబ్ లో పవన్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు