పవన్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఎవరు?


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తరువాత తెరకెక్కనున్న ఈ సినిమా పై ఇప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి. జల్సా వంటి క్రేజీ కాంబినేషన్ తరువాత రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఎవరు అనే విషయం పై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. మొదటగా ఈ సినిమా కోసం ఇలియానాని హీరొయిన్ గా తీసుకున్నట్లు చెప్పారు, ఆ తరువాత సమంతతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే తాజాగా వీరిద్దరినీ కాదని నిత్య మీనన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే పవన్ సరసన హీరొయిన్ గా నిత్య మీనన్ ఎంత వరకు సూట్ అవుతుందో అని ఫాన్స్ కంగారు పడుతున్నారు.

Exit mobile version