ఒక చిత్ర నిర్మాణంలో సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర పోషిస్తాడు చిత్రం ఎంత బాగా వచ్చింది అనేది ఇక్కడ నుండే లెక్కపెడతారు. కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ తెర మీద బ్లూ లేదా రెడ్ ఎక్కువగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మరికొంతమంది నటులను తెర మీద అప్పటి వరకు చూడనంత అందంగా చిపించి విజయం సాదిస్తుంటారు. ఉదాహరణకు “ఇష్క్” చిత్రాన్ని తీసుకుంటే అందులో నితిన్ మరియు నిత్యలను ఎప్పటికన్నా ఎక్కువ అందంగా పిసి శ్రీరాం చూపించారు.
మన పరిశ్రమలో అందమయిన హీరోలలో ఒకరు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఒకరు. ఆయన రాబోతున్న చిత్రం “బాద్షా” చిత్రం కోసం ఇప్పటికే నలుగురు సినిమాటోగ్రాఫర్లు మారారు. తాజాగా రాజశేఖర్,జయన్ విన్సెంట్ మరియు ఆండ్రూ స్థానంలో గుహన్ వచ్చి ఈ చిత్ర బృందంతో చేరారు. ఈ చిత్రంలో ప్రతి సినిమాటోగ్రాఫర్ ఏదో ఒక కీలక సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఎవరు ఎన్టీఆర్ ని అందంగా చూపించి ఉంటారనేది ప్రశ్న?
గుహన్ లాంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రంతో చేరాక చిత్రం మరింత స్టైలిష్ గా మారనుంది. కాని ఎవరు అందంగా చుపించారన్న ప్రశ్నకి సమాధానం మాత్రం చిత్రం విడుదల అయ్యాక తెలుస్తుంది.