ఈ ప్రశ్న కు వివిధ జవాబులు ఉన్నాయి. సమంతా ఈ నూతన సంవత్సర వేడుకను సిడ్నీ లో కుటుంబ సభ్యుల సమక్షం లో జరుపుకోనుంది. ఈ నటి 2011 లో “దూకుడు” వంటి భారి విజయంతో వేడుక జరుపుకుంటుంది. 2012 కూడా 2011 లానే మంచి అవకాశాలను విజయాలను తీసుకొస్తుంది అని నమ్మకంతో ఉంది. లక్ష్మి రాయ్ కాంచన వంటి విజయంతో 2012 లో అడుగుపెడుతున్న ఈ తార ఈ నూతన సంవత్సరాన్ని లండన్ లో జరుపుకుంటుంది. ఇలా జరుపుకోటం తన కల అని లక్ష్మి రాయ్ తెలిపింది. 2012 లో “అధినాయకుడు” చిత్రం మీద ఆసలు పెట్టుకొని ఉంది. త్రిష కుటుంబ సభ్యులతో కలిసి గోవా లో వేడుకలు జరుపుకోవాలని ప్రణాళిక వేసుకుంది.
అక్కడ నుండే అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలి అనుకుంటుంది. శ్రేయ మరియు శ్రుతి హాసన్ లు కూడా గోవా లో నే సంబరాలు జరుపుకోనున్నారు. శ్రేయ బాలివుడ్ వేడుక కు హాజరవుతుండగా శ్రుతి తన సంబరాలను రహస్యంగా జరుపుకుంటున్నారు. అనుష్క మాత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ లో ఈ సారి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుంది. ప్రియమణి షూటింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది. క్షేత్రం చిత్రం పెద్దగ లేకపోయినా వచ్చే ఏడాది తనకు కలిసి వస్తుంది అని చెపుతుంది.