జక్కన్న కరుణించేది ఎప్పుడో..?


ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా కోసం సరైన అప్డేట్స్ లేక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సతమతం అవుతూ ఉండే వారు కానీ ఇప్పుడు దాదాపు అలంటి పరిస్థితిలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం తారక్ తనకు అత్యంత ప్రీతీ పాత్రుడు అయిన సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు.

మరో మెయిన్ లీడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ హిస్టారిక్ మల్టీ స్టారర్ లో కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. కానీ తారక్ సిసలైన లుక్ ఎలా ఉండనుంది? అందుకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అని తారక్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం మూలాన అది వారికి దూరం అవుతూనే వస్తుంది.

పైగా ఇతర స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా వస్తుండటంతో రాజమౌళిపై మరింత ప్రెజర్ పడ్డట్టు అవుతుంది. ఇప్పుడు ఎలాగో జక్కన్న అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి తొందరలో ఒక మంచి రోజున రాజమౌళి తారక్ పై టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యొచ్చు. ఇక అప్పటి వరకు తారక్ అభిమానులకు ఎదురు చూపులు తప్పవు.

Exit mobile version