ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం పవన్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడితో ఒక చిత్రాన్ని కూడా చేస్తున్నారు. సరే ఇవన్నీ బాగానే ఉన్నా పవన్ నుంచి మాత్రం ఓ చేంజ్ ఎప్పుడు వస్తుందో తెలీడం లేదు. ఇటీవలే వకీల్ సాబ్ షూట్ పునః ప్రారంభం అయ్యింది. పవన్ కూడా అడుగు పెట్టాల్సి ఉంది.
అయితే ఈ సినిమాకు మరియు క్రిష్ సినిమాకు కూడా దగ్గర దగ్గర ఒకే లుక్ ఉంది. కానీ ఇపుడు పవన్ వాటికి భిన్నంగా కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు సమయం తక్కువ ఉంది ఈ గ్యాప్ కి మళ్ళీ పాత లుక్ లోకి ఎప్పుడు వస్తారన్నది చూడాలి. అలాగే తాజా టాక్ ప్రకారం ఒకే లుక్ కాబట్టి ఈ రెండు చిత్రాలను త్వరగా పూర్తి చేసేసి లైన్ లో ఉన్న అయ్యప్పన్ కోషియమ్ ను స్టార్ట్ చేసేయాలని అనుకుంటున్నారట. మరి ఇవన్నీ బాగానే ఉన్నా పవన్ ఎప్పుడు తన లుక్ ను చేంజ్ చేస్తారో చూడాలి.