శ్రీదేవిని చూసి చిరంజీవి చాలా భయపడ్డారట.

జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ 30ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ సినిమాకు సంబందించిన అనేక సంగతులు నెమరువేసుకున్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాకి కేంద్రబిందువై, కసిగా ఈ సినిమాను తెరకెక్కించారని ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత అశ్వినీ దత్ అభిరుచిని, సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఆయన అభినందించారు.

కాగా చిరంజీవి ఈ సినిమాలో దేవకన్య పాత్ర చేసిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. దేవతగా ఆమెను తప్ప ఎవరినీ ఊహించుకోలేము అని అన్నారు. ఆమె అందచందాలు, హొయలు, చిలక పలుకులతో అద్భుతం చేసింది అన్నారు. ఇక చిరంజీవి ఆమె పక్కన తేలిపోతానేమోనని భయపడ్డారట. అందుకే ఆయన ఆమెతో పోటీపడి నటించాల్సి వచ్చిందట. అసలు శ్రీ దేవి లేకపోతే ఈ సినిమా లేదని చిరంజీవి ఆమెను ప్రశంసించారు.

Exit mobile version