ప్రకాష్ రాజ్ అసలు పేరేంటి?

Prakash-Raj

ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అన్ని రకాల పాత్రలు చేస్తూ ఇండియన్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ అని ఎంతమందికి తెలుసు? అసలు ఆయన ఎందుకు ఆ పేరు మార్చుకున్నాడు అనే విషయాన్ని అడిగితే ‘ అది నా నిర్ణయం కాదండి, ఆ పేరుని బాల చందర్ గారు మార్చారు. నా పేరు విన్నప్పుడు నీ పేరులో ఉండే రాయ్ అనేది కర్ణాటక, తమిళనాడు ఇలా ఏదో ఒక రాష్ట్రాన్నే గుర్తించేలా ఉంటుంది అన్నారు. ఆయన నాలో జాతీయ స్థాయి నటున్ని చూసారు అందుకే నాకు ప్రకాష్ రాజ్ అని పేరు మారుస్తున్నానని చెప్పి పేరు మార్చారని’ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఎలాగైతేనేం మన ఇండియన్ సినిమాకి ఓ మంచి నటున్ని ఇచ్చారని చెప్పాలి.

Exit mobile version