పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాదిలోనే రెండో రిలీజ్ గా వస్తున్నా చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా ఇంకొన్ని రోజుల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు అంతకంతకూ హైప్ పెంచేసుకుంటున్నారు.
అయితే ఇదే మొదటికే మోసాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ తాలూకా అవుట్ పుట్ చూసి ఓజి లో ఈ సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ ఉంటాయి అనే విధంగా ఫ్యాన్స్ మరిన్ని హోప్స్ పెట్టేసుకుంటున్నారు. అలానే నిన్న వచ్చిన గన్స్ ఎన్ రోజెస్ లో కూడా కొన్ని క్రేజీ విజువల్స్ నిజంగానే ఉన్నాయ్ అని అనుకుంటున్నా ఫాన్స్ కి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
నిన్న సాంగ్ లో చూపించిన మిలట్రీ యాక్షన్ షాట్స్ అలానే చిరుతపులి షాట్స్ సినిమాలో లేవని క్లారిటీ ఇచ్చారు. సో ఓజి విషయంలో ఇలాంటి అనవసర హైప్ పెంచేసుకుంటే మాత్రం వాటిని మీరు తగ్గించుకోవాలి.