పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇంకా చేయాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం రీసెంట్ గానే మాట్లాడిన ప్రశాంత్ వర్మ ప్రభాస్ డేట్స్ వస్తే షూటింగ్ వెంటనే మొదలవుతుంది అని కన్ఫర్మ్ చేసాడు.
కానీ ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ గా మొత్తం కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు షూటింగ్ ఏంటి ఎలా చేయాలి అనేవి అన్నీ ముందే ప్రీ ప్లాన్డ్ గా గీసుకున్నాడట. సో ఇక ప్రభాస్ డేట్స్ ఒక్కటి వస్తే మాత్రం షూటింగ్ మొదలు పెట్టేసుకున్నట్టే అని చెప్పాలి. కానీ ఈ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ప్రశ్నగా మారింది.