చైతు ‘లవ్ స్టోరీ’ పరిస్థితి ఏమిటి ?

చైతు ‘లవ్ స్టోరీ’ పరిస్థితి ఏమిటి ?

Published on Jul 19, 2020 11:26 PM IST

శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా.. ఈ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ అంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు షూట్ ను ప్లాన్ చేస్తున్నారు.

అయితే మరో పక్క కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మరి లవ్ స్టోరీ షూట్ జరుగతుందా.. చూడాలి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

తాజా వార్తలు