పవన్ ప్రకటించిన మూడు చిత్రాలతో హరీష్ శంకర్ మూవీ ఒకటి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే పవన్ కోసం ఎలాంటి కథను ఆయన సిద్ధం చేస్తున్నారనే విషయంపై కూడా తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. గతంలో ఇది ఒక రీమేక్ అని వార్తలు రాగా వాటిని దర్శకుడు హరీష్ ఖండించారు. ఇది ఒక స్ట్రెయిట్ మూవీ అని చెప్పడం జరిగింది.
ఇక ఈ మూవీ కథపై ఎటువంటి సమాచారం కూడా లేకపోవడం విశేషం. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టే హరీష్ కథ ఉంటుందని తెలుస్తుంది. గతంలో వలే పవన్ బాడీ లాంగ్వేజ్ మరియు పంచ్ డైలాగ్స్ మరియు వన్ లైనర్స్ ఉండకపోవచ్చని సమాచారం. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ కి కావలసిన అంశాలతో హరీష్ ఓ కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేస్తున్నారట.