కింగ్డమ్: ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్

Kingdom

సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్డమ్”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా ఉంది. అయితే వారికి సహా సినిమా మ్యూజిక్ లవర్స్ కి మాత్రం ఒక అంశంలో డిజప్పాయింట్మెంట్ మిగిలింది.

ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్ హృదయం లోపల మొత్తాన్ని కట్ చేసేసారు. కనీసం ఈ స్కోర్ తో కూడిన లవ్ సీన్స్ లాంటివి కూడా సినిమాలో లేవు. దీనితో థియేట్రికల్ గా ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి మాత్రం ఒకింత నిరాశే మిగిలింది అని చెప్పక తప్పదు. మరి దీని తర్వాత ఏమన్నా యాడ్ చేస్తారో అనేది వేచి చూడాలి.

Exit mobile version