ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్

the raja saab

పాన్ ఇండియా స్టార ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ చిత్ర యూనిట్‌తో సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా రాజాసాబ్ సెట్స్ నుంచి ఓ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో దర్శకుడు మారుతితో కూల్ లుక్స్‌తో ప్రభాస్ జోవియల్‌గా ఉన్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version