పుష్ప లో బన్నీ అల్ట్రా స్టైలిష్ డాన్సులు ఉండవు.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప ఆయన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇది హీరో అల్లు అర్జున్ కి కూడా మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ తన సినిమాలలో ఎప్పుడు లాజిక్ మిస్ కాడు. సుకుమార్ కథకు తగ్గట్లు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తెరకెక్కిస్తారు. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా వచ్చిన రంగస్థలంలో ఆయన రామ్ చరణ్ పాత్రను ఎలా తీర్చి దిద్దాడో మనం చూశాం. ఇక పుష్ప మూవీలో కూడా ఆయన అల్లు అర్జున్ ని ఓ మొరటు లారీ డ్రైవర్ గా చూపించనున్నాడు.

ఈ నేపథ్యంలో పుష్ప మూవీలో సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్ కి బన్నీ స్టెప్స్ కానీ అదే తరహాలో ఉంటాయట. పల్లె నేపథ్యంలో యువకుల డాన్స్ స్టైల్ ని ఈ మూవీ కోసం సుకుమార్ అడాప్ట్ చేసుకుంటున్నారట. పుష్పాలో సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా అలానే ఉంటుందని సమాచారం. కావున బన్నీ అల్ర్టా స్టైలిష్ వెస్ట్రన్ మూమెంట్స్ పుష్పలో ఉండవని సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version