అతని దగ్గర అది ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు.!

అతని దగ్గర అది ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు.!

Published on Nov 13, 2012 5:37 PM IST

డీ గ్లామర్ పాత్రలతో ముందుగా నటిగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మళయాళ కుట్టి అమలా పాల్. ప్రస్తుతం అమలా పాల్ తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు నానిలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకే సమయంలో ఇద్దరు మెగా హీరోలతో కలిసి నటిస్తున్నారు. వారిలో గమనించిన ప్రత్యేకత ఏమిటి అన్న విషయాన్ని ఆమెని అడిగితే అమలా పాల్ మాట్లాడుతూ ‘ ‘మగధీర’ లాంటి అంత పెద్ద హిట్ అందుకున్నా రామ్ చరణ్ ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసి పనిచేస్తారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే సూపర్బ్ డాన్సర్, ప్రతి ఒక్క హీరోయిన్ అతనితో కలిసి నటించాలనుకుంటుంది ఎందుకంటే అతనితో కలిసి పనిచేస్తే ఖర్చు లేకుండా డాన్స్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు’ అని ఆమె అన్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పై దృష్టి పెడుతున్న అమలా పాల్ కి ఈ సినిమాలు మరింత క్రేజ్ తెస్తాయని ఆమె ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు