నాని – సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వి’. కాగా ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుంటే, నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎమోషనల్ రోల్ లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. నాని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో తన సినిమాగా ప్రమోట్ చేసుకుంటుండగా.. సుధీర్ బాబు సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూల దగ్గర నుంచీ టీవీ షోస్ దాకా పాల్గొంటున్నాడు. అయితే వీరిద్దరూ మాత్రం కలిసి సినిమాని ప్రమోట్ చెయ్యట్లేదు. కారణం వీరి మధ్య ఉన్న ఆధిపత్య పోరేనని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫరెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆవిష్కరిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో సమ్మోహనం వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన ఇంద్రగంటి ఈసారి సుధీర్ ను పవర్‌ఫుల్ పోలీస్ రోల్ లో చూపిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. ఇక హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది.