‘వార్ 2’ టీజర్ అదిరింది.. ‘గెట్‌ రెడీ ఫర్‌ ద వార్‌’ !

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఐతే, ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘వార్‌ 2’ టీమ్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ ఫుల్‌గా కనిపించారు. నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్‌.. ‘గెట్‌ రెడీ ఫర్‌ ద వార్‌’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది.

ఇక రెండో పాటను హృతిక్-ఎన్టీఆర్ పై షూట్ చేయనున్నారు. వచ్చే నెల హృతిక్-తారక్ పై ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్ లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version