డ్యాన్స్ ఫ్లోర్‌పై ఎన్టీఆర్-హృతిక్ WAR.. సలాం అనాల్సిందే అంటున్న నాగవంశీ..!

డ్యాన్స్ ఫ్లోర్‌పై ఎన్టీఆర్-హృతిక్ WAR.. సలాం అనాల్సిందే అంటున్న నాగవంశీ..!

Published on Aug 6, 2025 7:00 PM IST

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి వస్తున్న ది మోస్ట్ వాంటెడ్ స్పై యాక్షన్ సీక్వెల్ చిత్రం ‘వార్-2’ ఇప్పటికే వచ్చే వారం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సెన్సేషనల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీనికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌లో ప్రయత్నిస్తున్నారు. వరల్డ్‌వైడ్ క్రేజ్‌తో ఈ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ఓ డ్యాన్స్ నెంబర్ ఉందని.. మేకర్స్ చెబుతూ వచ్చారు. ఇక ఈ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను రేపు(ఆగస్టు 7) రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. డ్యాన్స్ ఫ్లోర్‌పై ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య వార్‌ను థియేటర్లలోనే చూడాలని.. అంతకు ముందు ఓ గ్లింప్స్ అభిమానులను అలరిస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్-2 చిత్ర ప్రీ-రిలీజ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తాము కృషి చేస్తున్నామని.. అన్నీ కుదిరాక అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు