అదిరిన ‘వార్ 2’ యాక్షన్ ప్రోమో.. స్పాయిలర్స్ పై మేకర్స్ అలర్ట్!

War2

ప్రస్తుతం భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో భారీ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా గట్టి బుకింగ్స్ ఇపుడు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదల ముందు మేకర్స్ సాలిడ్ ప్రోమో కట్ ని కూడా విడుదల చేశారు.

దీనితో సినిమాలో గ్రాండ్ యాక్షన్ ఫీస్ట్ ఖాయం చేయగా మరోసారి సినిమాలో స్పాయిలర్స్ పై అలర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా వార్ 2 ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ సినిమాలో స్పాయిలర్స్ ని రివీల్ చేయకుండా ఉండేందుకే చూడండి అంటూ రిక్వెస్ట్ చేసాడు. ఇపుడు మేకర్స్ కూడా అదే అంటున్నారు. మరి ఆ రేంజ్ సర్ప్రైజ్ సినిమాలో ఏముందో తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version