బ్రేకింగ్: ‘వార్ 2’ ట్రైలర్ కోసం స్పెషల్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

war2

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే “వార్ 2”. ఎన్నో అంచనాలు సెట్ చేస్తున్న ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నార్త్ నుంచి సౌత్ వరకు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక దీనికి ముందు అసలు బిగ్ ట్రీట్ వార్ 2 ట్రైలర్ కోసం కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దీనిపై మేకర్స్ ఫైనల్ గా బిగ్ అప్డేట్ ని అందించారు. దీనితో వార్ 2 ట్రైలర్ ని మేకర్స్ ఈ జూలై 25 న విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ డేట్ ని మేకర్స్ స్పెషల్ అని చెబుతున్నారు.

ఇండియన్ సినిమా దగ్గర ఇద్దరు ఐకాన్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 25 ని ఐకానిక్ గా లాక్ చేసి వారి సినిమాటిక్ జర్నీ లైఫ్ టైం లో గుర్తుండిపోవాలని డిసైడ్ చేసినట్టు చెబుతున్నారు. సో తెలుగు, హిందీ, తమిళ్ లో వార్ 2 ఈ మూడు రోజుల్లో సందడి చేయనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ మల్టీస్టారర్ చిత్రం ఆగస్ట్ 14న గ్రాండ్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version