బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. గ్రాండ్ గా విడుదలకి సిద్ధం అవుతుంది. ఇక ఈ చిత్రం ఇండియాలోనే ఒక ఫస్ట్ ఎవర్ రిలీజ్ గా ఓ కొత్త వెర్షన్ ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలోనే ఇండియన్ సినిమాకి డాల్బీ సినిమా కూడా ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వెర్షన్ లో విడుదల కాబోతున్న మొట్ట మొదటి సినిమాగా సినిమాగా నిలిచిందట. మరి ఈ వెర్షన్ లో వార్ 2 ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగస్ట్ 14న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.