బాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “వార్ 2”. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఇలా తెలుగు స్టేట్స్ లో కూడా ఎన్టీఆర్ మార్కెట్ లో మంచి విడుదల చూసిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నట్టు తెలుస్తుంది.
నైజాంలో ఈ సినిమా 4.25 కోట్ల షేర్ ని (జీఎస్టీ కాకుండా) అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇది వార్ 2 తోనే పోటీకి ఉన్న కూలీ సినిమాకి స్వల్ప లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కూలీ సినిమాకి 4.15 కోట్ల షేర్ వస్తే వార్ 2 కి ఇంకో పది లక్షలు ఎక్కువ వచ్చాయి. ఇలా నైజాం మార్కెట్ లో ఈ రెండు డబ్బింగ్ సినిమాల్లో వార్ 2 లీడ్ లో ఉందని చెప్పాలి.. ఇక డే 2 మాత్రం ఓవరాల్ గా వార్ 2 బుకింగ్స్ లో లీడ్ చూపిస్తుంది. ఇక రెండో రోజు రెండు సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.