మెగాస్టార్ ‘వేదాళం’కి స్టార్ డైరెక్టర్ ?

మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన చిరంజీవి ఈ మూవీ రీమేక్ లో నటించాలని నిర్ణయించుకున్నారట.

అయితే ఈ మూవీ దర్శకుడిగా మెహర్ రమేష్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ఈ సినిమాకి దర్శకుడిగా వినాయక్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తునాడు. ఇక మెహర్ రమేష్ తో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేయనున్నాడు. చిరంజీవి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడైన మెహర్ ఏ మూవీ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక వేదాళం రీమేక్ ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం కలదట. లేని పక్షంలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Exit mobile version