ఒక రోజు ముందుగానే డీటీహెచ్ లో ప్రీమియర్ వేస్తాం అంటూ ఊదరగొట్టిన కమల్ హాసన్ ‘విశ్వరూపం’ చివరికి తుస్సుమనేలా కనిపిస్తుంది. ఒకరోజు ముందుగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో డీటీహెచ్ లో ప్రీమియర్ వేస్తున్నాం అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ దీనికి విభేధించడంతో కమల్ వారితో మంతనాలు జరిపాడు. ముందు రోజు డీటీహెచ్ లో తాము భారీగా నష్టపోతామని వాదించిన వారు చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. ధియేటర్లో విడుదలైన నాలుగు రోజుల తరువాత డీటీహెచ్ లో వేసుకోవచ్చు అనేది ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం జనవరి 25న విడుదలవుతున్న ఈ సినిమా జనవరి 28న డీటీహెచ్ లో ప్రసారమవుతుంది.