‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వారి చేతుల్లోనే.. ఇంకెప్పుడు అంటున్న ఫ్యాన్స్!

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వారి చేతుల్లోనే.. ఇంకెప్పుడు అంటున్న ఫ్యాన్స్!

Published on Jun 3, 2025 8:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా రానుంది.

దీంతో ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ భారీ ఎత్తులో ఉండనుంది. దీని కోసం పలు సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే, ఈ చిత్ర సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం.. పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చాకే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చిరు సూచించడంతో, ఇప్పట్లో ఈ మూవీ రిలీజ్ డేట్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది.

ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ సీజీ కంపెనీల చేతుల్లో ఉండటంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు