‘విశ్వంభర’ డేట్ పై ఉత్కంఠ.. తమ్ముడుకే ఎఫెక్ట్ పడుతుందా?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ సినిమానే “విశ్వంభర”. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఫాంటసీ వండర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ పట్ల ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో జనవరిలో రావాల్సిన సినిమా ఇంకా రాలేదు.

కానీ ప్రస్తుతం సెప్టెంబర్ 18 డేట్ లో విశ్వంభర ఆగమనం ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ మొదలైంది. ఇదే కాకుండా సేఫ్ సైడ్ గా సెప్టెంబర్ 25ని కూడా మేకర్స్ చూస్తున్నారట. ఇది నిజం అయితే అక్కడ చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి ఉంది. దానికే ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. సో విశ్వంభర రిలీజ్ డేట్ పై మాత్రం మెగా అభిమానుల్లోనే ఒకింత ఎక్కువ ఉత్కంఠ నెలకొంది అని చెప్పవచ్చు.

Exit mobile version