విడుదల తేదీ : జూలై 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : గీత్ ఆనంద్, శ్రీ శ్రీహాన్, రోనీత్ రెడ్డి, మిత్ర శర్మ, అన్షుల ధావన్, జెన్నిఫర్ ఎమ్మానుఎల్, కౌశల్ మంద.
దర్శకుడు : దయానంద్ గడ్డం
నిర్మాత : రాజా దరపనేని
సంగీతం : స్మరన్
ఛాయాగ్రాహకుడు : వెంకట్ ప్రసాద్
కూర్పు : మార్తాండ్ కే వెంకటేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యూత్ ఫుల్ రోమ్ కామ్ డ్రామా వర్జిన్ బాయ్స్ కూడా ఒకటి. ఏ రేటెడ్ సినిమా థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తమ స్కూల్ ఏజ్ నుంచే ఎలాంటి కో ఎడ్యుకేషన్ లో చడవని ముగ్గురు కుర్రాళ్ళు ఆర్య (గీత్ ఆనంద్), డుండీ (శ్రీ శ్రీహాన్), రోన్నీ (రోనీత్ రెడ్డి) మొదటిసారి ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ లో జాయిన్ అవుతారు. చిన్నప్పుడు నుంచి అలాంటి స్కూల్స్, స్ట్రిక్ట్ తల్లిదండ్రులు మధ్య పెరగడంతో తమ యుక్త వయస్సు వచ్చేసరికి తమ ఏజ్ ఉన్నవాళ్లు అంతా గర్ల్ ఫ్రెండ్స్ ని సెట్ చేసుకొని వర్జినిటీ కూడా కోల్పోతారు. కానీ వీరు మాత్రం తమ వర్జినిటీ విషయంలో వెనుకబడి ఉంటారు. దీనితో కొత్త సంవత్సరం వచ్చేసరికి తమ వర్జినిటీ పోగొట్టుకుని అందరి యూత్ లానే ప్రౌడ్ గా తామూ నిలబడతామని శపథం కూడా చేస్తారు. అప్పుడు ఈ ముగ్గురు లైఫ్ లోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు సరయు (మిత్ర శర్మ), శ్లోక (అన్షుల ధావన్), లైలా (జెన్నిఫర్ ఎమ్మనుయల్) వచ్చాక వీరి లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? తమ వర్జినిటీ కోల్పోయారా లేదా? ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఈ ముగ్గురు అమ్మాయిలు వల్ల ఏం తెలుసుకున్నారు? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ పర్వాలేదని చెప్పొచ్చు. లీడ్ నటీనటుల్లో హీరో గీత్ ఆనంద్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించాడు. తన నటన బాగుంది. డాన్స్ మూమెంట్స్, ఫైట్స్ లో కూడా బాగున్నాడు. అలాగే రోనీత్ రెడ్డి కూడా తన రోల్ ని బాగా చేసాడు. నీట్ ఎమోషన్స్ ని తను పండించాడు.
కానీ వీరి కంటే హైలైట్ ఎంటర్టైనర్ మాత్రం శ్రీ శ్రీహాన్ అని చెప్పొచ్చు. ఉన్న కథనంలో తనపై సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. అక్కడక్కడా తనపై కామెడీ సీన్స్ మంచి రిలీఫ్ గా ఉన్నాయి. చూసేందుకు శివ కార్తికేయన్ లా ఉన్న ఈ నటుడు మంచి కామెడీ టైమింగ్ తో అమాయకపు నటనతో ఇంప్రెస్ చేసాడు. ఇక హీరోయిన్స్ లో కూడా ముగ్గురూ బాగానే చేశారు.
అయితే వీరిలో ముగ్గురికీ మూడు క్లారిటీలు ఉన్నాయి కానీ మిత్ర శర్మ పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే జెన్నిఫర్, అన్షుల లు తమ పాత్రల్లో సూట్ అయ్యారు. బాగానే చేశారు. అలాగే కథనంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కి ఇచ్చిన అల్టిమేట్ గా ప్రేమదే పై చేయి ఉంటుంది అనే ముగింపుతో ఇచ్చిన సందేశం బాగుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో కనిపించిన బేబీ నటుడు, కౌశల్ మంద, బంచిక్ బబ్లూ తదితరులు తమ పాత్రల్లో బానే చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే కథనంలో కొంచెం బోల్డ్ కంటెంట్ అతి గానే అనిపిస్తుంది. అలాగే చాలా వరకు రొమాంటిక్ సన్నివేశాలు ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపిస్తుంది. కథనం డిమాండ్ చేసినప్పుడు ఓకే అనుకోవచ్చు కానీ అనవసరంగా పెట్టిన సన్నివేశాలు చికాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా రోన్నీ జంట నడుమ రొమాంటిక్ సీన్స్ అయితే మరీ ఓవర్ గా అనిపిస్తాయి.
అలాగే సినిమాలో లైన్ కూడా రవిబాబు ‘క్రష్’ కి కొంచెం రిలేటెడ్ గా అనిపించింది. ఇక వీటితో పాటుగా నటీనటులు ఎంపిక కూడా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మెయిన్ లీడ్ హీరోయిన్ పాత్ర బాగుంది కానీ ఆ పాత్రకి డిమాండ్ చేసిన విధంగా హీరోయిన్ కనిపించలేదు. అలాగే మిగతా హీరోయిన్స్ ఓవర్ ఎక్స్ పోజింగ్ లాంటివి ఎంత యూత్ అయినా సరే అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
ఇక సినిమాలో ఫస్టాఫ్ చాలా వరకు బోర్ గానే సాగుతుంది. మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ వరకు ఓకే కానీ మిగతా సినిమా అంతా ఇది వరకే చూసిన కాలేజ్ ఫ్రెండ్స్ రొటీన్ డ్రామా లానే అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కూడా కొంతమేర రొటీన్ కథనం సాగుతుంది.
ప్రీ క్లైమాక్స్ వరకు కూడా సోసో గానే అనిపిస్తాయి. అలాగే ముగ్గురు హీరోయిన్స్ కలిసి మాట్లాడుకునే ఓ సన్నివేశం తరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలను ప్రశ్నించే విధంగా ఉంటాయి ఇవి కొంతమందికి నచ్చకపోవచ్చు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. ఒక యూత్ ఫుల్ డ్రామాకి కావాల్సిన సెటప్ అంతటినీ బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక వీటితో పాటుగా సంగీతం కూడా ఓకే, కొన్ని పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు దయానంద్ గడ్డం విషయానికి వస్తే.. తను కూడా టాలీవుడ్ యువతకి ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని మెసేజ్ తో ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇందులో అక్కడక్కడా కామెడీ, లాస్ట్ లో ప్రేమ సందేశం తప్పితే మిగతా కథనం మీద మాత్రం అంతగా దృష్టి పెట్టినట్లు అనిపించలేదు. ఇంకా బెటర్ కథనాన్ని ఎంగేజ్ చేసే సీన్స్ ని సిద్ధం చేసుకోవాల్సింది. ఈ విషయంలో మాత్రం తన వర్క్ వీక్ గా ఉంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘వర్జిన్ బాయ్స్’ కొన్ని చోట్ల వరకు ఓకే అనిపిస్తారు. లీడ్ నటులు బాగా చేసారు. వారిలో శ్రీ శ్రీహాన్ రోల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. అలాగే లవ్ మెసేజ్ కూడా ఓకే అనిపిస్తుంది కానీ మిగతా కథ, కథనాలు మాత్రం బలహీనంగా అనిపిస్తాయి. సో కొంతమేర యూత్ వరకు ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team