మెగా 157కి ఎసరు పెట్టిన విశ్వంభర.. అయోమయంలో అభిమానులు..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విశ్వంభర చిత్ర షూటింగ్ ముగించుకున్న చిరు, ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా 157 ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా 157 ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసినప్పుడే 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పుడు మెగా 157 చిత్ర రిలీజ్‌కు విశ్వంభర అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర చిత్ర వీఎఫ్ఎక్స్ పనుల జాప్యం కారణంగా ఈ సినిమా రిలీజ్ మరింత వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు విశ్వంభర చిత్రం అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ జాప్యంతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 కూడా సంక్రాంతి నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొందని చిత్ర వర్గాల్లో టాక్. మరి ఈ సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి ప్లాన్ ఆచరిస్తారో చూడాలి.

Exit mobile version