“ఫలక్ నమా దాస్”తో పాటు ‘హిట్’తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ హీరోగా, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకి “పాగల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసిందట చిత్రబృందం. కాగా ఈ సినిమాని ఈ రోజు పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి రానా మొదటి క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఫస్ట్ షాట్ ను నక్కిన త్రినాధ్ రావ్ డైరెక్ట్ చేయగా.. దిల్ రాజు, దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.
కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారాం నుండి మొదలుకానుంది. ఇక “ఫలక్ నమా దాస్” మరియు ‘హిట్’ లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.