మాస్ హీరో విశ్వక్ సేన్ కి హీరోగా మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అటు దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అయ్యారు. ‘#కల్ట్’ సినిమా రూపొందిస్తున్నారు. నూతన నటీనటులతో ఈ సినిమా రెడీ కాబోతుంది.
కాగా తాజాగా ‘#కల్ట్’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. నేటి నుంచి రెగ్యులర్ షూట్ కూడా జరగబోతుంది. కరాటే రాజు, సందీప్ కాకరాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ స్వరాలు అందించనున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించబోతున్నారు. తెలుగుతోపాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో ఈసినిమా రిలీజ్ కాబోతుంది.