‘ది రాజాసాబ్’ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ !

‘ది రాజాసాబ్’ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ !

Published on Dec 7, 2025 4:01 PM IST

The-Raja-Saab

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదా పడటంతో ‘ది రాజాసాబ్’ చిత్రం జనవరి 9, 2026న రిలీజ్ కాకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. నిర్మాత విశ్వ ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు.

‘‘విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది. థర్డ్‌ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం’ అని, ఇక ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై రూమర్స్‌ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం క్లియర్‌ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం’ అని నిర్మాత విశ్వ ప్రసాద్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు