టెలివిజన్ ప్రీమియర్‌ కు సిద్ధమైన తిరువీర్ సినిమా !

టెలివిజన్ ప్రీమియర్‌ కు సిద్ధమైన తిరువీర్ సినిమా !

Published on Dec 8, 2025 12:01 PM IST

Pre-wedding-show

నటుడు తిరువీర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. థియేటర్లలో మంచి స్పందనను పొందిన ఈ సినిమా అటు ఓటీటీలో కూడా విజయవంతమైన ప్రదర్శనను కొనసాగించింది. ఇప్పుడు ఈ చిత్రం టెలివిజన్ ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 14, 2025న సాయంత్రం 6.30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్‌కు ఈ సినిమా సిద్ధంగా ఉంది. టెలివిజన్‌ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని టీమ్ ఆశిస్తోంది.

కాగా గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ కామెడీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించగా రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఆలాగే, మాస్టర్ రోహన్, నరేంద్ర రవి మరియు యామిని నాగేశ్వర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం మరియు అష్మితా రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

తాజా వార్తలు