కడప దర్గాను సందర్శించిన మంచు విష్ణు

కడప దర్గాను సందర్శించిన మంచు విష్ణు

Published on Oct 31, 2012 2:27 AM IST


విష్ణు ఈ మధ్య చేసిన చిత్రం “దేనికయినా రెడీ” మంచి విజయం సాదించింది చాలా విరామం తరువాత మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా ప్రేక్షకులు మరియు పాత్రికేయులను కలుస్తూ వస్తున్నారు ఈ చిత్ర ఫలితం వెలువడ్డాక విష్ణు కడపలోని అమీర్ దర్గా కి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ విషయాన్నీ విష్ణు ట్విట్టర్లో వెల్లడించారు. కడపలో విష్ణు ముందు దర్గా అక్కడి నుండి ధియేటర్ కి వెళ్ళారు. నిన్న అయన చెన్నైలో “గుండెల్లో గోదారి” చిత్రానికి తమిళ రూపం “మరంతేన్ మన్నితేన్” చిత్ర ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్నారు. అక్కడ నుండి నెల్లూరులో థియేటర్ కి వెళ్ళారు అక్కడ నుండి కడప చేరుకున్నారు. ఈ చిత్రానికి రాష్ట్రం నుండి వస్తున్న స్పందన చూసి అయన ఆనందంలో మునిగి తేలుతున్నారు. జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించారు. ఈ చిత్రంలో హన్సిక కథానాయికగా నటించింది.

తాజా వార్తలు