దూసుకెళ్తాలో స్పెషల్ డాన్స్ లు ట్రై చేసిన విష్ణు

doosukeltha

విష్ణు మంచు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా ఈ అక్టోబర్ 17న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. విష్ణు గతంలో చేసిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘డీ’, ‘దేనికైనా రెడీ’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకున్నాయి. ‘దూసుకెళ్తా’ సినిమాతో విష్ణు తన డాన్సులతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

‘అప్పుడప్పుడు’ పాటలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజిషన్ లో విష్ణు కొన్ని స్పెషల్ డాన్సులు ట్రై చేసాడు. ఈ పాత చూసిన వాళ్ళు విష్ణు చాలా బాగా చేసాడని చెప్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ ఈ మొవిఎకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. వీరూ పొట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మించారు. మంచు విష్ణు సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య హీరోయిన్ గా కనిపించనుంది.

Exit mobile version