రాజాసాబ్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటున్న స్టార్ రైటర్

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ ట్రైలర్‌పై స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తాజాగా తన రివ్యూ ఇచ్చారు. తాను ఇటీవల రాజాసాబ్ ట్రైలర్‌ని చూశానని.. హారర్ జోనర్ చిత్రాల్లో ఇండియాలో తెరకెక్కిన సినిమాల్లో ఇది బెస్ట్‌గా ఉండబోతుందని.. ఇది ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని.. ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఆయన తెలిపారు.

దీంతో ఒక్కసారిగా రాజాసాబ్ ట్రైలర్‌పై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 9, 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version