మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక యాడ్ షూటింగ్ సమయంలో చిన్న గాయం పాలైనట్లు తెలుస్తోంది. అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గాయం సీరియస్ కాదని, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం అందుతోంది.
ఈ వార్తతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ఆఫీసు నుండి ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. ఆయనను కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని వారు తెలిపారు. అభిమానులు, మీడియా మరియు పబ్లిక్‌ని ఈ ఘటన గురించి ఊహాగానాలు సృష్టించకుండా ఉండాలని కోరారు.
ఇక సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని 2026 జూన్ 25న థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.