విడుదల తేదీ : జూన్ 27, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, బ్రహ్మానందం, కౌశల్ మంద, మధుబాల, శరత్ కుమార్ తదితరులు
దర్శకుడు : ముఖేష్ కుమార్ సింగ్
నిర్మాత : మోహన్ బాబు
సంగీతం : స్టీఫెన్ డావెస్సి
సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్
ఎడిటర్ : ఆంథోని
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారలు కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కన్నప్ప’. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
2వ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ ఐదు తెగలలో ఒకదానికి చెందిన తిన్నడు (మంచు విష్ణు) తన చిన్నతనంలోనే జరిగిన ఒక విషాద ఘటనతో సృష్ఠిలో దేవుడే లేడు ఒట్టి రాయి మాత్రమే అనే భావనతో బ్రతుకుతాడు. ఇంకోపక్క ఆ దగ్గరలోనే ఉండే వాయు లింగంకి వంశపారంపర్యంగా మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు) ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివునికి పరమ భక్తుడిని అనే భావనతో ఉంటాడు. మరి ఈ వాయు లింగానికి ఉన్న దివ్య శక్తుల రీత్యా దానిని సొంతం చేసుకోవాలి అనుకునే కాలా ముఖుడు (అర్పిత్ రంక) వల్ల వీరి తెగలకి వచ్చిన ఆటంకం ఏంటి? దేవుడే లేడు అనే తిన్నడుకి రుద్ర (ప్రభాస్) చూపిన మార్గం ఏంటి? అసలు ఈ తిన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు? తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా? లాంటివి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో మేజర్ ప్లస్ పాయింట్స్ లో మొదటిగా మంచు విష్ణు కోసమే చెప్పాలి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మాటకి తన లైఫ్ టైం పెర్ఫార్మన్స్ ని ఈ చిత్రానికి తను ఇచ్చేసాడు అని చెప్పడంలో సందేహమే లేదు. ఒక నాస్తికుడుగా ఎంతైతే కాన్ఫిడెన్స్ గా కనిపించాడో అంతే రీతిలో మహా శివుని భక్తునిగా అంతకు మించే తన లోని నటుడుని అందరికీ చూపించి విమర్శకుల నోర్లు మూయిస్తాడు.
ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో అయితే తన డామినేషన్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. సాలిడ్ పర్సనాలిటీతో సింగిల్ టేక్ డైలాగ్స్ తో ఎమోషనల్ గా ఇంకోపక్క అగ్రెసివ్ గా అన్ని వెరీయేషన్స్ ని విష్ణు అద్భుతంగా చూపించాడు. అంతేకాకుండా తనపై త్రిశూలంతో ఓ ఎలివేషన్ సీన్ విజిల్ వేసేలా ఉంటుంది.
ఇక మరో మేజర్ ప్లస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పవచ్చు. మొదట్లో తన పాత్రపై ఏవో కామెంట్స్ వచ్చి ఉండొచ్చు కానీ సినిమాలో తన రోల్ ని అందులో ప్రభాస్ నటన చూసిన తరువాత ఆ కామెంట్స్ అందరూ వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా కథనమే మారిపోయింది. అక్కడ నుంచి ఎలాంటి డీవియేషన్ లేకుండా క్లైమాక్స్ వరకు ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రభాస్ తన డైనమిక్ ప్రెజెన్స్ ని చాలా మంది ఊహించను కూడా ఊహించని రేంజ్ లో కనిపించి చాలా బలం చేకూర్చాడు.
అలాగే మోహన్ లాల్ సాలిడ్ కేమియో సినిమాలో వర్కౌట్ అయ్యింది. తనతో పాటుగా మంచు విష్ణుపై ఓ కీలక సన్నివేశం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఇంకా శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లు ఒదిగిపోయారు. అక్షయ్ కుమార్ నోట తెలుగు లోనే డైలాగులు పలికించడం మరో విశేషం.
ఇలా మోహన్ బాబు తనకి ఈ తరహా పాత్రలు ఇస్తే ఎలా విశ్వరూపం చూపిస్తారో అదే రీతిలో తన అనుభవాన్ని చూపించారు. వీరితో పాటుగా ప్రీతి ముకుందన్ సినిమాలో బాగుంది. ఇంకా ఇతర నటీనటులు బాగా చేశారు. ఇక వీటితో పాటుగా సినిమాలో ఎమోషన్ ని దైవత్వాన్ని ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి దర్శకుడు బాగా నడిపించారు. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ అయితే కదిలిస్తుంది. ప్రస్తుత జెనరేషన్ కి ఆ శివునికి ఉన్న మహాభక్తుని కథని ఆకట్టుకునేలా చూపించడం బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మెప్పించే అంశాలతో పాటుగా ఒకింత నొప్పించే అంశాలు కూడా కొన్ని లేకపోలేవు. హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాలు పాటలు తగ్గించేసి ఉంటే బాగుండేది. ఒక ఫ్లోలో వెళ్లే సమయంలో ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి.
అలాగే ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కథనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగితే బాగుండు. చాలా వరకు సీన్స్ ఒకింత ల్యాగ్ అనిపిస్తాయి. అంతేకాకుండా ఫస్టాఫ్ లో ఆ గూడెం తెగలు వారి నడుమ వైరం, యుద్ధ సన్నివేశాలు అంత ఎంగేజింగ్ గా అనిపించవు.
యాక్షన్ పార్ట్ కూడా ఒకింత వీక్ గా అనిపిస్తుంది. వీటిని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. అలాగే వి ఎఫ్ ఎక్స్ ని కూడా మెరుగ్గా చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా వి ఎఫ్ ఎక్స్ పనులకి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బెటర్ విజువల్స్ ని చూపాల్సింది. స్టీఫెన్ డావెస్సి పాటలు చాలా బాగున్నాయి. బాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. షెల్డన్ చావ్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాలో బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ బానే ఉంది కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించాడు. తన కథలో ఎమోషన్, దైవత్వాన్ని మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బాగానే ప్రెజెంట్ చేశారు. విష్ణు కూడా స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేసాడు కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించి డివోషనల్ ట్రాక్ లోనే నడిపి ఉంటే కన్నప్ప దీనికంటే ఇంకా సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ఓవరాల్ గా వీరి వర్క్ మాత్రం బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ‘కన్నప్ప’ సినిమా ఒక ఆకట్టుకునే హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు. కథనంకి తగ్గట్టుగా ప్లాన్ చేసిన అగ్ర తారాగణం ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించగా ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి టేకోవర్ చేసిన విష్ణు ఒక సాలిడ్ ఎమోషనల్ ట్రీట్ తో చాలా రోజులు తర్వాత ఒక హిట్టింగ్ డివోషన్ డ్రామాని ప్రేక్షకులకు అందించాడు. ఫస్టాఫ్ ఇంకా కొన్ని సీన్స్ మినహాయిస్తే ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పించి కదిలిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team