‘దూసుకేళ్తా’ సినిమాతో ఇప్పటివరకూ బిజీగా వున్న మంచు విష్ణు ఇప్పుడు తన తదుపరి చిత్రం షూటింగ్లో పాల్గుంటున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, హన్సిక, ప్రణీత సుబాష్ వంటి తారలు నటిస్తున్నారు. యూరప్లో స్లోవనియా అనే ప్రదేశంలో మంచు విష్ణు, హన్సికల నడుమ ఒక పాటతో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ఇక్కడే ఇదివరకు విష్ణు, లావణ్య తమ ‘దూసుకేళ్తా’ సినిమా షూటింగ్ జరుపుకున్నారు. ‘దేనికైనా రెడీ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాదించడంతో హన్సిక విష్ణుతో మరోసారి జతకట్టనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఎం.ఎం కీరవాణి, బప్పా లహరి, అచ్చు మరియు బాబా సాహిగల్ సంగీతాన్ని అందిస్తున్నారు.